భోజనంలో పురుగులు వచ్చాయంటూ హైదరాబాద్ జేఎన్టీయూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇవాళ మంజీరా హాస్టల్‌లో భోజనం చేస్తుండగా పురుగులు కనిపించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు భైఠాయించి నినాదాలు చేశారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
