తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా రూ.80 కోట్లు డిమాండ్ చేశాడని సమాచారం. దీంతో అంత మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.