తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్‌ఛార్జి కావడంతో కిరణ్ కుమార్ నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారిని గవర్నర్‌గా నియమిస్తే రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
