వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్. నెలకు రూ.248తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. దీంతో 6జీబీ డేటా, వీఐ మూవీస్ అండ్ టీవీ(ఎంటీవీ) ప్రో సబ్‌స్క్రప్షన్ లభిస్తుంది. సాధారణంగా వీఐ ఎంటీవీ ప్రో సభ్యత్వం విడిగా తీసుకుంటే నెలకు రూ.202 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో డిస్నీ+, సోనీలివ్, క్లిక్ సహా పలు ఓటీటీలు లభిస్తాయి. అయితే దీన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే యాక్టివ్ సర్వీస్ వ్యాలిడిటీ ప్లాన్ ఉండాల్సిందే.