తెలంగాణలో తొలి ఏకాదశి (జూలై 17)న రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆగస్టు 15లోపు 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కొలిక్కి వస్తుండటంతో ముందే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా అప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.