1990వ దశకంలో తనను కలవలేదని ఒక అభిమాని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలపై సోనాలి బింద్రే తాజాగా స్పందించారు. అభిమానులు చేసే కొన్ని పనులు తనను బాధిస్తాయని అన్నారు. ‘ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు. అభిమాన హీరోయిన్‌ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడం బాధాకరమైన విషయం. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు’ అని అన్నారు.