మనమే మూవీతో హిట్ అందుకున్న హీరో శర్వానంద్ మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ శర్వా 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ హీరోయిన్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఏజెంట్, గండివధారి అర్జున చిత్రాల ఫేమ్ సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. నేడు సాక్షి బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమెకు విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.