హైదరాబాద్ – మాదాపూర్‌లోని పలు హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. పలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు గుర్తించారు. హాస్టళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టళ్ల కిచెన్ గదులు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన అధికారులు.. పలు హాస్టళ్లకు నోటీసులు జారీ చేశారు.