UPDATES  

 విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ ముఖ్యం.. ఎంపీపీ రేసు లక్ష్మి..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 19::

విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై శ్రద్ధ చూపగలుగుతారని ఎంపీపీ రేసు లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని కే రేగుబల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సికిల్ సెల్ ఆనీమియా( రక్తహీనత) నమూనా పరీక్షలు డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ బాగా చదివి మంచి మార్కులతో సాధించాలని అన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ, డాక్టర్ పుల్లారెడ్డి ఇరువురి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, నోడ్సులు, బెడ్ షీట్స్, టవల్స్, తదితర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ మంగతాయారు , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి నాగమణి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !