UPDATES  

 పనులు వేగవంతం చేయండి..! పర్ణశాలలో సబ్ స్టేషన్ ,అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన కలెక్టరు..!

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం,జూన్ 19::

మండలంలోని పర్ణశాల గ్రామాన్ని నూతన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ముందుగా ఆయన గోదావరి వరదల వల్ల నీట మునిగి పాఠశాల సబ్ స్టేషన్ ను పరిశీలించి ఎంత మేరకు గోదారి వస్తే నీటమునిగే అవకాశం ఉందని అధికారులు అడిగి తెలుసుకున్నారు. రానున్న గోదావరి వరదల్లో కరెంటు, నీటి కొరత లేకుండా చూసుకోవాలని ఈ సబ్ స్టేషన్ చిన్న బండిరేవు గ్రామానికి తరలించి యుద్ధ ప్రతిపాదికన పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్ణశాల జిల్లా పరిషత్ హై స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జరుగుతున్న తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాగునీరు కరెంటు లైటింగ్ ఫ్యాన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఎంఈఓ ను సున్నితంగా మందలించారు. 1000 లీటర్ల రెండు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి త్రాగునీరు ఫిల్టర్ ద్వారా డైరెక్ట్ రూమ్ లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అపరిశుభ్రంగా ఉన్నటువంటి పాఠశాల పరిశుభ్రతపై మండిపడ్డారు, పాఠశాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీఓ ముత్యాలరావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఏ ఈ రాజ్ సుహస్, ఎలక్ట్రికల్ అధికారులు మోహన్ రెడ్డి, దుమ్ముగూడెం సీఐ అశోక్, ఐటిడిఏ ఈఈ తానాజీ డి ఈ హరీష్ పంచాయతీరాజ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !