- ఎనిమిది గంటల పని విధానం అమలు జరపాలి
- గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి
- ఐఎఫ్టియు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలో ఐఎఫ్టియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు గ్రామపంచాయతీలోని గ్రామ పంచాయితీ కార్మికుల సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా తేగడ గ్రామపంచాయతీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ తేగడ, చర్ల మండలంలో అనేక పంచాయతీలోని కార్మికులకు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకోవడం సరైన పద్ధతి కాదు అని అన్నారు జీతాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలకు జీతాలను వెంటనే ఇవ్వాలని కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదాలు జరిగినప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని జీవిత బీమా సౌకర్యం కల్పించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ప్రతినెల నిర్దిష్ట సమయంలో జీతాలు అకౌంట్లోకి వేయాలని హెల్త్ కార్డులు యూనిఫామ్ లు రక్షణ పరికరాలు ఇవ్వాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేనియెడల కార్మికులందరినీ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తేగడ కార్మికులు రత్నకుమారి జగదీష్ ప్రభాకరు త్రిమూర్తులు పాల్గొన్నారు.