టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించిన వెబ్ సిరీస్ ‘పరువు’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘ఇలాంటి అద్భుతమైన ‘పరువు’ సిరీస్‌ను తెరకెక్కించిన టీంకు అభినందనలు. ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి పాట్లు. చివరికి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్-2లో చూడాలనుకుంటున్నాను’ అంటూ చిరు రాసుకొచ్చారు.