మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు దంధ్యాల రాణి 15 సం.. రమ్య 14 సంవత్సరాలు వీరి తల్లిదండ్రులు చనిపోయారు వీరిలో చిన్నమ్మాయి రమ్య కొన్ని రోజుల క్రితం పాముకాటుకు గురై చనిపోవడం జరిగింది. శుక్రవారం రమ్య 11 వరోజు సందర్భంగా జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు కందల శివారెడ్డి 10 వేల రూపాయలు, తొగిటి దామోదర్ 5 వేల రూపాయలు, మంగపేట బదిలీ మీద వెళ్లిన ఎస్ గాదరి రవికుమార్, 50 కేజీల బియ్యం సహకారంతో ఇవ్వడం జరిగింది.గతంలో కూడా వీరికి ట్రస్ట్ నుంచి సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధానకార్యదర్శి మునిగాల రాకేశ్, ఉపాధ్యాక్షులు కస్పా ముకుందం,మహిళా సభ్యులు కమిటీ సుమలత, గౌరవసలహాదారులు సయ్యద్ బాబా,ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు రోహిత్,ఆదినారాయణ,మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు.