మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం, రాజుపేట గ్రామానికి చెందిన అనుముల అప్పిరెడ్డి గుండె పోటుతో ఇటీవలే మృతిచెందగా, ఆ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శుక్రవారం నాడు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు.
ఈ కార్యక్రమం లో మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, సొసైటీ చైర్మన్ తోట రమేష్ ,జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి,కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, కూర్బన్ అలీ, కర్రీ శ్యాంబాబు ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్ ,మండల నాయకులు,చిట్టీమల్ల సమ్మయ్య,మాలికంఠ శంకర్, యడ్లపల్లి నర్సింహరావు, చిలకమర్రి రాజేందర్,రఘు,చల్లగురుగుల తిరుపతి ,దంతానపల్లి నరేందర్,సొసైటీ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్ , మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, ,తదితరులు పాల్గొన్నారు.