మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో జరిగిన అభినందన, ఆహ్వాన సభకు విచ్చేసిన ప్రఖ్యాత తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, ఉద్యమ జానపద రచయిత, సినిమా గీత రచయిత, కవి, గాయకుడు మన మిట్టపల్లి సురేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమక్షంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ బి ఏ ఎం ఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ బత్తిని భార్గవి, సాధించిన విద్యార్థిని తండ్రి బత్తిని సారంగపాణిని, గురువారం ఘనంగా సన్మానించారు
మారుమూల గుండాల పరిసర ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా విద్య పట్ల తల్లిదండ్రులు ఇంట్లో ప్రోత్సాకరం అవసరమని వారు గుర్తు చేశారు. శిల్పాలను చెక్కి శిల్పి ఎంత ప్రఖ్యాతి చెందుతారో,, విద్యార్థుల పట్ల క్రమశిక్షణ మంచి నడవడిక గురు మర్యాదలు విద్య పట్ల ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు నిరంతరాయంగా వారి యోగక్షేమాలను చూసుకుంటూ ఉన్నత విద్యలపట్ల ప్రోత్సహించటం అంతే అవసరమని వారు గుర్తు చేశారు. అదే క్రమంలో ఆంధ్రప్రభ విలేకరి సారంగపాణి కూతురు గుండాల మండలంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ బి ఏ ఎం ఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సాధించి మండలానికి దిక్సూచిగా నిలవడం మన మండలానికి గర్వకారణం అని వారు కొనియాడారు. ఆడపిల్లలు అబలలు కాదు ఆదిపరాశక్తిగా కార్పొరేట్ కాలేజీలో విద్యనభ్యసించిన విద్యార్థిని విద్యార్థులకు దీటుగా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని మన్యంలో పుట్టిన కూతురు నేడు హైదరాబాద్ రాజధానిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ బి ఏ ఎం ఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ పట్టా సంపాదించడం మండల ప్రజలకు ఒక వరంగా భావించాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాతి గాంచిన అమ్మ పాట ప్రేరణగా చెప్పడం, మన ఊరి ప్రేమాభిమానాల ప్రస్తావన మనకు గర్వ కారణమని పలువురు ప్రేమ పూర్వక ఆహ్వానంతో ఆత్మీయ సన్మానం చేపట్టడంజరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గడ్డం సతీష్, సర్పంచ్ సీతారాములు, కొప్పుల జీవన్, గడ్డం మోహన్, సరోజ్, కందుకూరి సంతోష్, మాదాల అశోక్, నవీన్, రాము, ఆజాద్, గడ్డం సంపత్, వ్యాసారపు సురేష్ , యాసారపు రవి , గుండెబోయిన లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.