మన్యం న్యూస్ గుండాల: అక్రమ గుట్కా వ్యాపారాన్ని ఉక్కు పాదంతో అణచివేస్తామని గుండాల ఎస్ఐ కిన్నర రాజశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యాపారుల వద్ద ఉన్న సుమారు 12 వేల రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిన్నెర రాజశేఖర్ పేర్కొన్నారు మండలంలో ఎవరైనా నిషేధిత గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు