UPDATES  

 మండలంలో పర్యటించిన ఇల్లందు డీఎస్పీ చంద్రబాను..

మన్యం న్యూస్ గుండాల: ఇల్లందు డిఎస్పి చంద్రబాను గుండాల మండలంలో పర్యటించారు. చెట్టుపల్లి, శంభుని గూడెం గ్రామాల్లోని ప్రజలతో సమావేశమై అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ప్రజలను కోరారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలని పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ ఎల్ రవీందర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !