ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేసీ.. పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదు. తనను ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత పరిపాలన, విధానాలపై తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకూ పవన్ రాజకీయాల్లో ఉండకపోవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే పవన్‌కు రాజకీయాలకంటే సినిమాలే బెటర్.’ అని కామెంట్స్ చేశారు.