UGC NET పేపర్ లీక్ కేసులో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ గురువారం FIR నమోదు చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు షిఫ్ట్‌లలో 83 సబ్జెక్టులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను నిర్వహించింది. పరీక్ష పేపర్ డార్క్‌నెట్‌లో రూ.5 లక్షలకు విక్రయించారని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్‌కు సమాచారం అందింది.