తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ యాక్టర్లలో విజయ్ సేతుపతి ఒకడు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో విలన్ రోల్స్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. ‘కథలో నైతికత ఉండాలి.. విలన్ పాత్రైనా సరే కొన్ని విలువలుండాలి. ఆ పాత్ర ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు. నటీనటులు, డైరెక్టర్లు భిన్న అభిప్రాయాలు, భావోద్వేగాలు కలిగి ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.