వరుస పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణిస్తారు. వారికి 5 నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించనున్నారు.