తమిళనాడులో కల్తీసారా తాగి మృత్యువాత పడిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. కళ్లకురిచి జిల్లాకు చెందిన వారి ఆరోగ్య పరిస్థితి విషమించగా మరో 15 మంది చనిపోయారు. దీంతో మొత్తం ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. ఇంకా 88 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ కేసులో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు