ఆర్థిక సంవత్సరం 2018-19 నాటి ఆదాయాలతో పోల్చితే.. 2023-24లో టెల్కోల రెవెన్యూ ఏకంగా 87 శాతం పెరిగి రూ.2.39 లక్షల కోట్లకు చేరిందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ వెల్లడించింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సేవలను ప్రారంభం తర్వాత టెల్కోల ఆదాయాల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుందని తెలిపింది. ఎయిర్‌టెల్ రెవెన్యూ 12 శాతం పెరిగి రూ.88,700 కోట్లుగా, జియో ఆదాయం 10 శాతం పెరిగి రూ.99,200 కోట్లుగా నమోదయ్యింది.