టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వినియోగించే డ్రగ్ ‘ఒజెమ్‌పిక్’ మౌంజారో, ఇతర జీఎల్‌పీ-1 ఔషధాల నకిలీ వెర్షన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా హెచ్చరికలు చేసింది. బరువు తగ్గించుకొనే మార్గంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ ఔషధాల నకిలీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ వెర్షన్లు మార్కెట్లకు పోటెత్తుతున్నాయని పేర్కొన్నది. నకిలీ మందు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది.