మన్యం న్యూస్ గుండాల: గొడవటంచ గ్రామస్తుల గోడు విని హై లెవెల్ వంతెనను మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను గుండాల జడ్పిటిసి రామక్క కోరారు . కిన్నెరసాని వాగు వర్షాకాలం వచ్చిందంటే ఉధృతంగా ప్రవహించడం వలన కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు ఆగిపోతాయని ఆమె పేర్కొన్నారు. గ్రామస్తుల మొర ఆలకించి హై లెవెల్ వంతెనను మంజూరు చేయాలని కోరారు. కొడవటంచ గ్రామంలో నిత్యవసర వస్తువుల దుకాణాన్ని జిసిసి ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పరిషిక రవి, యానయ్య, మల్లయ్య, మంగయ్య, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు