మన్యం న్యూస్ గుండాల: పచ్చదనం పరిశుభ్రత తోనే ఆసుపత్రి ప్రాంగణాలు ఉండాలని అలా ఉంచేందుకు నిత్యం కృషి చేస్తున్నామని స్థానిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రంలోని ఆస్పత్రి ఆవరణలో వైద్య సిబ్బంది మొక్కలు నాటారు. ఔషధ మొక్కలైన తులసి, రణపాల, నేల ఉసిరి వంటి మొక్కలతో పాటుగా పొడవుగా పెరిగే మొక్కలు ములగ, చింత, వెలగ, కరివేపాకు, జామ, నేరేడు వంటి వివిధ జాతుల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పీ హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మనిష్ రెడ్డి మాట్లాడుతూ… మొక్కలు మనకు ప్రాణవాయువులే కాకుండా వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారి సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి పద్మ. ల్యాబ్ టెక్నీషియన్ రమేష్. ఎంటీఎస్ సత్యం, హెల్త్ అసిస్టెంట్లు రాఘవులు, బిక్ష. ఏఎన్ఎంలు అరుణ, మంగ వేణి, ధనమ్మ, కమల,అనసూర్య, మీనా, ఎంఎల్ ఎచ్ పీ, మౌనిక, సంగీత, డిఈఓ సత్తిబాబు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు