చంద్ర మండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలివైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకొని లూనార్ ల్యాండర్ చాంగే-6 వ్యోమనౌక మంగళవారం భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు డ్రాగన్ వెల్లడించింది.