దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, నెట్ పేపర్ లీకేజీపై ఆమె మాట్లాడుతూ.. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోదంన్నారు. నిందితులపై చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందన్నారు.