UPDATES  

 బాబోయ్ నిలువు దోపిడి..అధికారుల పర్యవేక్షణ లోపంతో పేట్రేగిపోతున్న కిరాణా షాప్ నిర్వాహకులు…

  • బాబోయ్ నిలువు దోపిడి.
  •  అధికారుల పర్యవేక్షణ లోపంతో పేట్రేగిపోతున్న కిరాణా షాప్ నిర్వాహకులు.
  •  ఫైన్ రైస్ మాటున స్టోర్ బియ్యంఅమ్మకాలు.
  •  ఫైన్ రైస్ కు బదులుగా తక్కువ క్వాలిటీ బియ్యాన్ని అంటగడుతున్నవైనం.
  •   గట్టిగా అడిగితే భద్రాచలం వెళ్లి అడగండి అంటూ బెదిరింపులు.
  •  ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనటూ చోద్యం చూస్తున్న అధికారులు.

 

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో కిరాణా షాప్ నిర్వాహకులు అధిక రేట్లతో నాణ్యతలేని బియ్యాన్ని విక్రయిస్తూ పేద ప్రజల రక్తం తాగుతున్నారు, స్టోర్ బియ్యాన్ని పాలిష్ చేపించి మంచి బ్రాండ్ ఉన్న సంచిలో పోసి అభం శుభం తెలియని అమాయక ప్రజలకు అంటగడుతూ ఫైన్ క్వాలిటీ అంటూ వారిని మోసం చేస్తున్న పరిస్థితులు మండల కేంద్రంలోఅంబేద్కర్ విగ్రహం వెనకున్న కిరాణా షాపులో బట్టబయలైంది. సూపరానికి పాతిక కేజీలు,కాటా వేస్తే 24 కేజీలు రావడం విశేషం. పైకo మాత్రం మొత్తం 25 కేజీలకు చెల్లించాల్సిందే నట ఈ భారీ మోసం పట్లకిరణా షాప్ నిర్వాహకులను నిలదీసిన నేపద్యంలో భద్రాచలం నుంచి పంపిస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు, అని మొహం చాటేస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఒక బియ్యం విషయంలోనే అనుకుంటే పొరపాటే శాంపిల్ కోసం వచ్చిన ప్రతి ఒక్కనూనె ప్యాకెట్ కి,ఫాన్స్ డబ్బాలకు,బై వన్ గెట్ వన్ ఫ్రీ, అని కంపెనీ వాడు ఇస్తే వీరు మాత్రం ఫ్రీ వచ్చిన వాటిని కూడా డబ్బులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న పరిస్థితులు ఆ కిరాణా షాపులో ఉన్నాయి అని బాధితులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఫైన్ క్వాలిటీవనపర్తి బియ్యమంటూ, జె ఎస్ ఆర్ కంపెనీకి చెందిన బియ్యాన్ని పేద ప్రజలకు విక్రయించిన పరిస్థితులు మండలంలో ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. మోసం బట్టబయలు అయినా సరే కిరాణా షాప్ నిర్వాహకులు మాత్రం నిజం ఒప్పుకోవడం లేదు. వనపర్తి బ్రాండ్ ఉన్న ప్యాకింగ్ ను తీసేసి ఈమధ్య జెఎస్ఆర్ అని ఇస్తున్నారు అని పేద ప్రజలను బుఖాయించిన పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. ఇకనైనా ఉన్నత అధికారులు అధిక రేట్లతో పేద ప్రజలను పీల్చుకో తింటున్న రాంబాబు పాన్ షాప్ ఎదురుగా ఉన్న కిరాణా షాపును అధికారులు సీజ్ చేసి మండలంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బాధితులు మండల ప్రజలు పత్రికాముఖంగా కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !