మన్యం న్యూస్ గుండాల: మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మండలంలో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. మండలం పరిధిలోని దామరతోగు, చిన్న వెంకటాపురం, సయనపల్లి, గణపురం గ్రామాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. వీటిలో మావోయిస్టు హింసకాండ అంటూ చత్తిస్గడ్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు పాల్పడుతున్న వరుస హింసాత్మక ఘటనలలో ఆదివాసీ యువకులు తీవ్రంగా గాయపడి కాళ్ళు చేతులు కోల్పోయారని అందులో పేర్కొన్నారు. జూన్ రెండో తారీఖున మావోయిస్టుల మరిచిన మందుపాతర పేలి ఆదివాసీ యువకుడు మాధవి నంద గాయాలపాలయ్యారని అందులో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని కరపత్రాల్లో పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసులు నినాదాలు చేశారని కరపత్రాలలో పేర్కొన్నారు