UPDATES  

 పెద విద్యార్థుల అభ్యున్నతికై వారధిగా చర్ల రక్షకబటులు.- సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి ఇన్వర్టర్, బ్యాటరీ వితరణ..

మన్యం న్యూస్ చర్ల:

చర్ల మండలంలోని ఉన్న విద్యార్థుల్లో పట్టుదల,ఏకాగ్రత, ఏదైనా సాధించాలని తపనతో మండల కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మండల పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన పేద విద్యార్థుల ఆశలకు వారధిగా నిలిచారు. గ్రంథాలయానికి కరెంటు అందుబాటు లేని సమయంలో ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో చర్ల సీఐ ఏ రాజువర్మ ఆధ్వర్యంలోని చర్ల పోలీసులు పెద్ద మనస్సుతో మానవతా హృదయం సాటి ఇన్వర్టర్,బ్యాటరీ ని వితరణగా ఇచ్చారు.గతంలో చర్ల ఎస్సైగా నాలుగు సంవత్సరాల పాటు పనిచేసిన ఏ రాజువర్మ గారు ఏజెన్సీ ప్రాంతంపై పూర్తి పట్టు కలిగి అనేక సమయాలలో యువతని క్రీడల వైపు ప్రోత్సహిస్తూ,విద్యార్థుల్ని విద్య వైపు ప్రోత్సహిస్తూ, క్రీడలపై, చదువులపై అవగాహన కల్పించేవారు.అనంతరం ప్రమోషన్ పై క్రైమ్ బ్రాంచ్ సీఐగా బదిలీపై వెళ్లారు. కొంతకాలం కొత్తగూడెంలో పనిచేసి తదనంతర బదిలీలలో భాగంగా గత సంవత్సరం చర్ల సిఐ గా బాధ్యతలు చేపట్టింది మొదలు మారుమూల అటవీ ప్రాంత గ్రామాలలో గిరిజనుల అభ్యున్నతికై, అభివృద్ధికై అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాక, నిరుపేదలైన విద్యార్థులను చదువులో ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు శాంతిభద్రతలు పర్యవేక్షిస్తూనే, మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను తనదైన శైలిలో వ్యూహాత్మకంగా కట్టడి చేస్తూ,మండలంలో అనేక కార్యక్రమాలలో మానవత్వం చాటుతూ ముందు కదులుతున్నారు.దానిలో భాగంగా శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పేద విద్యార్థులు పోటీ పరీక్షల నిమిత్తం గ్రంథాలయంలో ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో కరెంటు అందుబాటు లేని సమయంలో విద్యార్థులు పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మానవత్వంతో ఇన్వర్టర్, బ్యాటరీని వితరణగా అందజేశారు.ఈ కార్యక్రమంలో చర్ల ఎస్సై ఆర్ నర్సిరెడ్డి గారు ,లైబ్రరీయన్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !