తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు అడుగులు వేస్తుందని BRS ట్వీట్ చేసింది. ‘మొదటగా హైదరాబాద్‌లో కరెంట్ బిల్లుల వసూలును అదానీ గ్రూప్‌కు రేవంత్ ప్రభుత్వం అప్పగించబోతోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో కరెంట్ కావాలన్నా, కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు, వినియోగదారులు మోకరిల్లాల్సిందే’ అని పేర్కొంటూ ఫోటోను జోడించింది.