- పంచాయతీ వర్కర్ ను తన ఇంటి పని మనిషిని చేసిన పంచాయతీ కార్యదర్శి
- ఆమెను అసభ్య పదజాలంతో తిడుతూ ఇంటి పని చేయాలని కుకుంజారి
- విచారణ చేపడుతున్నాం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం ఎంపీ ఓ శ్రీనివాస్
మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గ్రామపంచాయతీ సిబ్బందిని తన ఇంటి పనుల కోసం ని సిగ్గుగా పని చేయిస్తున్నాడు పంచాయతీ పని చేయాల్సిన సిబ్బందిని తన ఇంటి వద్ద ఉడవడం కల్లాపు చల్లడం ఇల్లు తుడవడం బట్టలు ఉతకడం అన్నం కూర వండడం లాంటి పనులను చేయించడమే కాక సదరు వర్కర్ అయిన కుమారిని అసత్య పదజాలంతో రోజు తిట్టుతూ సునక్కానందాన్ని పొందుతున్నాడు సదరు వర్కర్ ఓపిక నశించి పంచాయతీ కార్యాలయానికే వెళ్లి యుద్దానికి దిగింది అధికారికే చెప్పు చూపిస్తూ తనదైన శైలిలో విరుచుకుపడింది. మహిళా వర్కర్ అని చూడకుండా ఆమెను దుర్భాషలాడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నత అధికారులను కోరుతున్నారు. ఈ అధికారి ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున కుచ్చుటోపి పెట్టాడు ఉపాధి హామీ తనిఖీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డట్టు సామాజిక తనిఖీలు తేటతెర్లాడు అయింది ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సదరు పంచాయతీ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
*విచారణ చేసి నివేదిక ఉన్నతాధికారులకు పంపుతా. ఎంపీ ఓ శ్రీనివాస్*: పంచాయతీ వర్కర్ ను ఇంటి పనులకు వాడుకుంటున్న సంఘటనపై ఫిర్యాదులు అందాయని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఉన్నత అధికారులకు పంపిస్తాం