మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
టి20 ప్రపంచ కప్ లో ఇండియా అద్భుతమైన విజయం సాధించడంతో దుమ్ముగూడెం మండల యువకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ప్రపంచ కప్ గెలవడంతో జయహో ఇండియా అంటూ నినాదాలు చేస్తూ లక్ష్మీనగరం నుంచి బైరగులపాడు వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.కొన్ని సంవత్సరాల ఇండియన్ ప్రేక్షకుల కల నేడు నెరవేరడంతో దుమ్ముగూడెం మండల యువకులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీం ఇండియా టీం కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.