ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు జులై 6 నుంచి జులై 19 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 315 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రైల్వేశాఖ తరఫున సుమారు 15 వేల మంది భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఫకువాల్ తెలిపారు.