UPDATES  

 పురుగుల మందు తాగి బలవత్ మరణానికి పాల్పడ్డ ఎస్సై..!నిర్గాంతంపోయే విధంగా ఎస్సై చర్యకు రాజకీయ ఒత్తుల్లే కారణమా..?

  • పురుగుల మందు తాగి బలవత్ మరణానికి పాల్పడ్డ ఎస్సై.
  •  నిర్గాంతంపోయే విధంగా ఎస్సై చర్యకు రాజకీయ ఒత్తుల్లే కారణమా?.
  •  లేక అధికారుల వేధింపులా?
  •  పదేపదే ఆయనపై సహచరుల ఫిర్యాదులే ఈ ఘాతుకానికి కారణమని పుకార్లు షికారులు!..
  • వచ్చి ఐదు నెలలైనా కాలేదు, బలవత్ మరణానికి పాల్పడడానికి కారణం ఏమై ఉంటుంది.?
  •  అంతుచిక్కని విధంగా వివిధ కోణాల్లో ఆలోచింపజేస్తున్న ఎస్సై చర్య.

మన్యం న్యూస్ అశ్వరావుపేట.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో ఎస్సై అదృశ్యమైన సంఘటన అందరికీ విధితమే,

అయితే ఈ విషయం పట్ల మన్యం న్యూస్ కొంచెం లోతుగా వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో విస్తృతమైన విషయాలు బట్టబయలు అయ్యాయి. బలవత్ మరణానికి పాల్పడ్డ ఎస్సై శ్రీరాముల శ్రీనివాసరావు జూన్ 30న కనిపించకుండా వెళ్లి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో తెల్లవారుజామున పురుగుల మందు తాగి బలవత్ మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది, తాగిన కొంతసేపటికి ధైర్యం కోల్పోయి తనకు తానే 108 అంబులెన్స్ కి చరవాణి ద్వారా సమాచారం అందించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలుసుకున్నా 108 సిబ్బంది, మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కి తరలించి వైద్యం అందించినట్టుగా వైద్యుల బృందం తెలిపారు.

ఎస్సై బలవత్ మరణానికి కారణం స్టేషన్ సిబ్బందికి ఎస్ఐకి గత కొంతకాలం నుంచి బేధాభిప్రాయాలు రావడమే అని తెలుస్తోంది, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నట్లుసమాచారం, కొత్త చట్టాలు రాష్ట్రంలో వచ్చిన నేపథ్యంలో వాటిపై అవగాహన సూచనలు వారి సిబ్బందికి చేసి తన సొంత వెహికల్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వినాయకపురం మీదుగా వెళ్లినట్టు మండల పోలీసులు వెల్లడించారు. అప్పటివరకు వారి చరవాణిలో పనిచేస్తున్నాయని వినాయకపురం దాటిన తర్వాత రెండు చరవానిలు స్విచ్ ఆఫ్ అయ్యాయని, భయంతోఈ విషయాన్నిపై అధికారులకు తెలియజేసినట్టుగా సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ఎస్సై శ్రీరాములు శ్రీనివాసరావు పై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఈ ఆరోపణల పై స్థాయి అధికారులు కూడా కాస్త మందలించినట్టుగా వారి సహచరులు వెల్లడించారు. ఇవన్నీ పరిస్థితులు భరించలేక పురుగుల మందు సేవించడం జరిగిందని, విశ్వసనీయ సమాచారం, మెరుగైన వైద్యం కోసం భాగ్య నగరానికి తరలించినట్టుగా ఎంజీఎం వైద్యులు వెల్లడించారు.

ఈ విషయంతో మండలంలో భయానక వాతావరణం నెలకొంది, రక్షించాల్సిన రక్షక బటులకే రక్షణ కరువైతే మండల ప్రజలను ఎవరు రక్షిస్తారని మండల ప్రజల్లో గుబులు మొదలైనట్టు బహిరంగంగానే తెలుస్తోంది. ఏదిఏమైనాప్పటికీ ఈ విషయంలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని ఇటువంటి సంఘటనలు ఒక ఎస్ఐ లాంటి వారికీ పునరావృతం అవ్వకుండా వారిపై ఒత్తిడిని కాస్త తగ్గించి ,లా అండ్ ఆర్డర్ ను కాపాడవలసిందిగా యావత్ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు పత్రికాముఖంగా కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !