- మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల కరపత్రాలు విడుదల.
- సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి.
- యువత రాకెట్ సైన్స్ వైపుపరిగెత్తాలి.
- అడవిలోకి కాదు.
- ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్.ఎస్ఐ తాజుద్దీన్
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏజెన్సీ గ్రామీణ అటవి ప్రాంతాలలో ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దంటూ వివరాలతో కూడిన వాల్ పోస్టర్లు కరపత్రాలను. ఏటూరు నాగారం ఆర్టీసీ బస్టాండ్ లో సిఐ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో. ఎస్సై ఎస్కే తాజుద్దీన్. అంటించి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్ పోస్టర్లో ఉన్న వారి సమాచారం తెలిస్తే నేరుగా గాని చరవాణి ద్వారా గాని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అంతేకాకుండా వారి సమాచారం తెలిపిన వారికి పోస్టర్లో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదు. ప్రజల మధ్యలో ప్రజా జీవనములోకి జరుగుతున్న అన్యాయం పట్ల చట్టసభల్లో యుద్ధం చేస్తే ఫలితం ఉంటుంది తప్ప అడవిలో తుపాకి పడితే దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని, బావి భారతాన్ని మార్చాలంటే యువత రాకెట్ సైన్స్ వైపు పరిగెత్తాలి తప్ప అడివిలోకి కాదు అంటూ చుట్టూ ఉన్న ప్రజలను చైతన్యపరిచారు.ఈ మేరకు పోలీస్ వారి నెంబర్లు ప్రతి ఒక్కరూ తీసుకొని మావోయిస్టుల సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరి వారి నెంబర్లు కింద ఉన్న విధంగా తెలిపారు.
సిఐ ఫోన్ నెంబర్.8712670100 ములుగు ఎస్పీ. శబరీష్.8712670104 ఏటూరు నాగారం ఏఎస్పీ.8712670113 సిఐ అనుముల శ్రీనివాస్.8712670090. ఎస్సై ఎస్ కే తాజుద్దీన్ వీరిలో ఎవరికైనా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, తో పాటు సివిల్ .సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.