మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయింది.