హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.