- ప్రజలు లేకుండానే ఉపాధి హామీ ప్రజా వేదిక
- స్థానిక అధికారుల కనుసన్నల్లోనే సామాజిక తనిఖీ కార్యక్రమం
- ఓకే కుటుంబంలో సభ్యులందరికీ విడివిడిగా జాబ్ కార్డ్
- ఎండలో మట్టి పని చేసిన వారికి అధికారుల టోక్రా
- కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
మన్యం న్యూస్ గుండాల:ప్రజలు లేకుండానే ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ విడివిడిగా జాబు కార్డులు మంజూరు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మండల కేంద్రం ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చేస్తూ సాఫీగా అవినీతి కొనసాగిస్తున్నారు. ఎండలో మట్టి పని చేసిన వారి రిజిస్టర్ లోని దినములను ఏమారుస్తూ ఉపాధి హామీ కూలీల పొట్ట కొడుతున్నారు. ఈ విధంగా ఉండగా సంవత్సరానికి ఒకసారి సామాజిక తనిఖీలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆడిట్ సిబ్బంది గుర్తించారు. మంగళవారం జరిగిన 15వ విడత సామాజిక తనిఖీ ఆ వేదిక కార్యక్రమంలో ఈ అంశం తేటతెల్లమైంది. అవినీతి జరిగిన అధికారులపై షోకాజ్ నోటీస్ ఇస్తామని అడిషనల్ పిడి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరుగుతున్న ఉన్నతాధికారులు పట్టిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రజా వేదికలో తేటతెల్లమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవినీతి అధికారులకు కొరడా జూలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు