మన్యం న్యూస్ భద్రాచలం.
భద్రాచలం మండల కేంద్రంలో సుభాష్ నగర్ కాలనీకి చెందిన కొత్తపల్లి శాలిని అనే పేద విద్యార్థిని త్రివేణి జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది,మొదటి సంవత్సరంపూర్తిగా చదివే స్తోమత లేని పరిస్థితిలో ఉన్న ఆమెను మదర్ తెరిసా ట్రస్ట్ గమనించి పేద విద్యార్థిని శాలినికి మొదటి సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలను మెటీరియల్ ను అందజేశారు. అంతేకాకుండా ట్రస్ట్ సభ్యులు చోళ ఇన్సూరెన్స్ మేనేజర్ వి.బాలరాజు సహకారంతో విద్యార్థినికి ఆమె తల్లికి 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం
ట్రస్టు వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ పేదరికంతో చదువుకోలేని దుస్థితికి ఏ పేద విద్యార్థి ఉండకూడదని, రేపటి భవిష్యత్తు నేటి బాల బాలికల తోనే సాధ్యమవుతుందని , చెప్పులు కుట్టుకునే అబ్రహం లింక్కన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన జ్ఞానాన్ని గుర్తించకపోతే ఇంకా చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు, ఈ ఉద్దేశంతోటే ఏజెన్సీలో ఉన్న బాల బాలికల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోకుండా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి జ్ఞానాన్నిముందు తరాల భవిష్యత్తుకు బాసటగా నిలిపి నూతన అభివృద్ధిని ప్రజ్వలింపజేసే విధంగా వారి ఆలోచన విధానాన్ని భారతదేశ స్థితిగతులను మార్చడంలో ప్రథమ భూమిక పోషించే విధంగా తయారు చేయడానికే మా మదర్ తెరిసా ట్రస్ట్ చెయూత కు చెయూత ని అందించింది అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకుపేద విద్యార్థిని శాలిని చదువు కోసం భవిష్యత్తులో కూడా ట్రస్టు ద్వారా చేతనైన సహాయం అందిస్తామని వారుతెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల మురళి, సభ్యులు వి.బాలరాజు, కోమటిరెడ్డి.చైతన్య, సాయికుమార్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.