UPDATES  

 రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు.

ఇది దేశానికి నష్టదాయకం

ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు.

దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి.

సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు.

దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం

బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం

మేం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రూట్ ను ఎంచుకున్నాము

వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలలో యాత్ర కొనసాగేలా చేసుకున్నాం

అంతే కాని గుజరాత్ లో యాత్ర సాగించకూడదని కాదు.

కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ.. ఇక్కడ నియంతృత్వం ఉండదు.

ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంది.

కానీ బీజేపీ, టీఆరెస్, ఇతర పార్టీలు ఎప్పుడైనా ఇలా ఎన్నుకున్నాయా?

బీజేపీ, టీఆరెస్ లు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి.

అందుకే ఆ రెండు పార్టీలు ఒకటే అని పదే పదే చెబుతున్నా

టీఆరెస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.

అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే ఆ పార్టీతో పొత్తు ఉండదు.

రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చు..

టీఆరెస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు.

చాలా సంవత్సరాల క్రితమే నేను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్న

కానీ కోవిడ్ విజృంభించడం, ఇతర కారణాల తో చేయలేకపోయా.

ఈ యాత్రతో వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగ పడుతుంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు.. ఖచ్చితంగా పొలిటికల్ యాత్రే

ప్రస్తుతం నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను కొనసాగించడమే నా లక్ష్యం.

రాజకీయపరమైన అంశాలపై యాత్ర ముగిశాకే మాట్లాడుతా

ప్రజలతో మమేకమవడానికి ఈ యాత్ర ఒక గొప్ప ముందడుగు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !