UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం :  మై ఫోర్స్ మహేష్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం ప్రతి ఒక్క జన సైనికుడు బాధ్యతని, ఆయన జోలికి వస్తే జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ మానవ బాంబులు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మై ఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం ఎం.జి.గ్రాండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం చుట్టూ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని వెంబడిస్తూ ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు వచ్చి గొడవ కూడా చేశారని సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ జనసేన అధినేతను దుర్భాషలాడుతూ సిబ్బందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు.

అయినా సయమనం పాటించిన సిబ్బంది ఈ ఘటన వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ కూడా విశాఖపట్నం సంఘటన తర్వాతే ఇలా జరుగుతుండడం గమనార్హమని జనసైనికులలో అనుమానాన్ని బలపరుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని పవన్ కళ్యాణ్ కు కేంద్ర బలగాలతో కూడిన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. జనసేన అధినేతకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే రాష్ట్రంలోని ప్రతి జన సైనికుడూ మానవ బాంబుగా మారటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల సహనాన్ని, మంచితనాన్ని వైకాపా ప్రభుత్వం, నాయకులు చులకనగా తీసుకోవద్దని, పవన్ కళ్యాణ్ కోసం ప్రతి జన సైనికుడు మానవ బాంబులై ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆయనకు ఏ రకమైన హాని తలపెట్టాలని చూసినా రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు.

అనంతరం జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర నారాయణ మాట్లాడుతూ జనసేన అధినేత కు తాము వ్యక్తిగతంగా మూడంచల భద్రత కల్పించుకుంటామన్నారు. భద్రత కల్పించాల్సిన వ్యవస్థ భద్రత కల్పించకపోగా ప్రత్యర్థులకు ఇంటలిజెన్స్ గా పనిచేస్తుందని దుయ్యపట్టారు. ఒకసారి గతంలో రంగాను పోగొట్టుకున్నాం ఇప్పుడు తమ ప్రాణాలు అడ్డుపెట్టి అయినా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ని కాపాడుకుంటామన్నారు. అదేవిధంగా సీఎం మెప్పుకోసం కొంతమంది కాపు పాలెగాళ్లు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే కాలంలో ఆ పాలెగాళ్ళకు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !