UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 భారత జట్టు ‘చోకర్స్’ అంటూ జట్టుపై విమర్శలు

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి తమ జట్టుకు విజయాన్నందించారు. ఒత్తిడికి తలొగ్గిన జట్టు ఒత్తిడికి తలొగ్గిన జట్టు సెమీఫైనల్ మ్యాచులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవగా.. రోహిత్ శర్మ కూడా సరిగా ఆడలేదు.

కాసేపటికే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఈ క్రమంలో కోహ్లీ, పాండ్యా జట్టును ఆదుకున్నారు. కానీ ఓపెనర్లు పేలవంగా ఆడటం, తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోవడంతో తర్వాతి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటంతో భారత జట్టు ఆశించిన స్కోరు చెయ్యలేకపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఎదురు దాడికి దిగడంతో బౌలర్లు కూడా ఒత్తిడికి లోనై చేతులెత్తేశారు

చోకర్స్’ అని పిలవచ్చు.. ఈ ఓటమిపై భారత మాజీలు స్పందించారు. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్.. భారత జట్టు ‘చోకర్స్’ అంటూ విమర్శించాడు. ‘భారత జట్టు సెమీస్‌లో ఒత్తిడిని జయించలేకపోయింది. వాళ్లను కావాలంటే చోకర్స్ అని పిలవచ్చు. దాంట్లో తప్పేం లేదు’ అని కపిల్ అన్నాడు. అదే సమయంలో కేవలం ఒక్క ఓటమితో జట్టుపై విమర్శలు గుప్పించాల్సిన అవసరం లేదన్నాడు.

పిచ్‌ను ఇంగ్లండ్ అర్థం చేసుకుంది పిచ్‌ను ఇంగ్లండ్ అర్థం చేసుకుంది మ్యాచ్ జరిగిన అడిలైడ్ ఓవల్ పిచ్‌ను ఇంగ్లండ్ బ్యాటర్లు చక్కగా అర్థం చేసుకున్నారని కపిల్ తెలిపాడు. ‘వాళ్లు పిచ్‌ను అర్థం చేసుకున్నారు. మంచి క్రికెట్ ఆడారు. భారత్ చేసిన స్కోరు తక్కువేం కాదు. కానీ పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చెయ్యకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఒక్కసారి వాళ్లు ఎన్ని షార్ట్ బాల్స్ వేశారో చూడండి’ అని కపిల్ దేవ్ అన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !