UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 సీఐడీ సిరీస్ మళ్లీ స్టార్ట్

సీఐడీ… క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో బుల్లితెరపై ఓ సంచలనం దాదాపు 21 ఏళ్లపాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీలో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరియల్‏కు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా అభిమానులున్నంటే అతిశయోక్తి కాదు. అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ సీరియల్ 2018లో ముగిసింది.

ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చినట్టే అనిపిస్తోంది. ఈ సిరీస్ మళ్లీ ప్రారంభమవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సీఐడీలో ఏసీపీ ప్రద్యుమన్ గా అలరించిన శివాజీ షేర్ చేసిన ఫొటోనేనని తెలుస్తోంది. శివాజీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటోలో ఇన్‏ స్పెక్టర్ దయా, ఇన్పెక్టర్ అభిజిత్ పాత్రల నటులతో పాటు ఈ సిరీస్ సృష్టికర్త బీపీ సింగ్ కూడా ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు పెదనాన్న బీపీతో గ్యాంగ్ ఆఫ్ సీఐడీ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో మళ్లీ సీఐడీ స్టార్ట్ అవుతుందంటూ ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఏమీ వెలువడలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !