ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసిలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల కోసం రెండు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈమధ్య మాట్లాడుతున్న మాటలన్నీ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆయనకు ముందే బోధపడిందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఆయనకు ఒక్కసారిగా తన భవిష్యత్తు ఏంటో తెలిసినట్టు ఉంది. అందుకే అలా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏంటో చంద్రబాబుకు అర్థం అయినట్టు అనిపిస్తంది. ఇటీవల కర్నూలు పర్యటనలోనూ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు మాట్లాడటం అందరం విన్నాం. అక్కడే కాదు.. ఎక్కడ మాట్లాడినా కూడా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు.
మీరు గెలిపిస్తే సరి.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు అని కర్నూలులో డైరెక్ట్ గానే మాట్లాడారు చంద్రబాబు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణలో పార్టీ భూస్థాపితం అయిపోయింది. అయినప్పటికీ పార్టీ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు టీడీపీ నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు కానీ.. ఏదో పేరుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అంటే.. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీకి పట్టిన గతే ఏపీలోనూ పట్టనుంది. అయితే.. ఓవైపు పార్టీకి 160 సీట్ల వరకు వస్తాయంటూ చెబుతున్న పార్టీ అధినేత.. రాబోయే ఎన్నికల్లో చివరి ఎన్నికలు అనడంలో ఆంతర్యం ఏంటి అనేది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. అయితే.. ప్రజల్లో సానుభూతి పొందేందుకు.. టీడీపీ కార్యకర్తలను బెదిరించి అయినా పని చేసుకోవడం కోసం.. ఇవే చివరి ఎన్నికలు అని భయపెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారా? అసలు ఆయన వ్యూహం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.