తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలో చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్లు ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసీఆర్‌ను ప్రజల్లోకి తీసుకువచ్చేలా ఒత్తిడి తెస్తోంది. ఏదో ముప్పు ముంచుకొస్తోందని భావించిన కేసీఆర్ ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి రాక తప్పని పరిస్థితిని కల్పించింది బీజేపీ. KCR- modi ఎన్నికలకు ఇంకా ఏడాదే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రగతి భవన్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇక ప్రజల మధ్యనే ఎక్కువగా మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు పెండింగ్‌లో ఉన్న హామీలను నెరవేర్చడంతోపాటు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై కేసీఆర్ దృష్టిసారించారు. ఈ క్రమంలో డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటలు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ఏయే జిల్లాలో ఎప్పుడు పర్యటించాలి, ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రారంభోత్సవాలు చేయాలి అనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల బాట.. డిసెంబరు 4న ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లో పర్యటించి, అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడ కూడా నూతన కలెక్టరేట్ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు పాత కలెక్టరేట్ ఆవరణలో నూతన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మినీ ట్యాంక్‌బండ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇతర కార్యక్రమాల కోసం అనేక చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం షెడ్యూల్ ఖరారైన మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. KCR- BJP హామీల అమలుకు కార్యాచరణ.. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి ఇంకా కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేలా ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలన్నారు. అందుకనుగుణంగా పార్టీ నేతలకు చేరువయ్యే కార్యక్రమాలను ప్లాన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందులో భాగంగానే తాను జిల్లా పర్యటనకు కూడా వెళ్లనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కచ్చితమైన తేదీలు ఖరారు చేసిన తర్వాత ఆయన ఈ జిల్లాల పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.