టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంతతో బ్రేకప్ చెప్పిన తర్వాత వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నాడనేదే ఆ వార్త.
గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా నిన్న ఇద్దరూ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా వారు ఫొటోకు పోజు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారానికి వీరి తాజా కలయిక మరింత బలాన్ని చేకూర్చింది. మరోవైపు సమంత అభిమానులు చైతూకి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఒకవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతుంటే, నాగచైతన్య కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఆనందంగా గడుపుతున్నాడని విమర్శిస్తున్నారు.