UPDATES  

 లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

హ్యాపీడేస్ పేరుతో అప్పట్లో వచ్చిన సినిమా గుర్తుందా? ఆ సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది. కానీ.. ఇప్పటికీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. శేఖర్ కమ్ముల ఆ సినిమాకు డైరెక్టర్. ఆయన అంతకుముందు ఆనంద్ లాంటి సినిమా తీసి ఒక మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత హ్యాపీడేస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల పేరు మారుమోగిపోయింది. ఆయన సినిమాలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఎలాంటి హడావుడి ఉండదు. ఆయన తీసిన సినిమాల్లో ఫిదా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన ఎక్కువగా కొత్త నటులతో సినిమా తీస్తుంటాడు. ఎక్స్ పరిమెంట్ చేస్తుంటాడు. అయితే.. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ అనే సినిమాలో షగున్ కౌర్ అనే యువతి నటించింది. సినిమాలో తన పేరు పద్దూ. అభిజీత్ సరసన నటించింది ఆ ముద్దుగుమ్మ.

అయితే.. షగున్ కౌర్.. ఆ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాల్లో నటించినా తనకు అంతగా గుర్తింపు రాలేదు. నిజానికి.. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత షగున్ కౌర్ సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుంది. Life is Beautiful Actress : పద్మావతి పాత్రలో నటించిన షగున్ కౌర్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? తను లా చదివింది. లాయర్ గా సెటిల్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడంతో తన గురించి సినీ అభిమానులు కూడా మరిచిపోయారు. కానీ.. తను మాత్రం లైఫ్ లో సెటిల్ అయి లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ అన్నంతగా తన కుటుంబ బాధ్యతలో పడిపోయిందన్నమాట. అయితే.. తన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఎక్కడా దొరకడం లేదట. కానీ.. తను మాత్రం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి ప్రైవేట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !