UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 కొలహలంగా కోల్ ఇండియా ఫుట్ బాల్ పోటీలు క్రీడలు అనేవి ఐక్యతకు చిరునామాలు పోటీలు ప్రారంభోత్సవంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ

కొలహలంగా కోల్ ఇండియా ఫుట్ బాల్ పోటీలు
క్రీడలు అనేవి ఐక్యతకు చిరునామాలు
పోటీలు ప్రారంభోత్సవంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయ
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 30… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియం వేదికగా ఈనెల 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరిగే 34వ కూలింగ్ స్థాయి ఫుట్ బాల్ పోటీలు మొదటిరోజు బుధవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు కోల్ ఇండియా స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి 9 ప్రధాన జట్లు తలపడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు, నాగపూర్, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ. కొత్తగూడెం సింగరేణి ఆధ్వర్యంలో కోల్ ఇండియా స్థాయిలో ఫుట్బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోటీలకు గాను అతి తక్కువ వ్యవధిలోనే సింగరేణి ప్రకాశం స్టేడియాన్ని అతి సుందర మనోహరంగా తీర్చిదిద్దిన సింగరేణి యాజమాన్యానికి సిబ్బంది కృషికి అభినందిస్తున్నామన్నారు. క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి ప్రతీకలుగా నిలవడమే కాకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఈ పోటీలలో గెలుపు ఓటములు సహజంగా తీసుకుని ఐక్యతను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం బసవయ్య కొత్తగూడెం డిఎస్పి వెంకటేశ్వర బాబు టీబీజీకేస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సోమిరెడ్డి ఏఐటీయూసీ నేత దమ్మలపాటి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !